కర్మనఘాట్‌లో అక్రమ కబ్జా సమస్యకు ఆర్‌జీఎన్ హ్యూమన్ రైట్స్ రంగంలోకి

కర్మనఘాట్‌లో అక్రమ కబ్జా సమస్యకు ఆర్‌జీఎన్ హ్యూమన్ రైట్స్ రంగంలోకి

కర్మనఘాట్‌లో అక్రమ కబ్జా సమస్యకు ఆర్‌జీఎన్ హ్యూమన్ రైట్స్ రంగంలోకి

లీగల్ అడ్వైజర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పిటిషన్ దాఖలు – నేషనల్ ప్రెసిడెంట్ దేవానంద నాయుడు సలహాలు

హైదరాబాద్‌ నగరంలోని కర్మనఘాట్ ఫేజ్-3, నందనవనం కాలనీలో భూమి కబ్జాకు గురైన కుటుంబం సమస్యపై ఆర్‌జీఎన్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ స్పందించింది. అక్రమంగా భూమిని ఆక్రమించిన వారు రెడ్ పిటిషన్ వేశారు. ఈ కేసుకు సంబంధించి ఈనెల 7వ తేదీన హైకోర్టులో హియరింగ్ ఉండటంతో, సంఘం తరఫున లీగల్ ఇంప్లీడ్ పిటిషన్ మరియు కేవియేట్ పిటిషన్ వేయాలని నిర్ణయించింది.

ఈ చర్యలు ఆర్‌జీఎన్ నేషనల్ ప్రెసిడెంట్ దేవానంద నాయుడు గారి సలహాల మేరకు తీసుకోబడుతున్నాయని, సంఘం నేషనల్ సెక్రటరీ శ్రీనివాస్ రాథోడ్  లీగల్ టీంతో కలిసి బాధితులను కలిసి వారి సమస్యలపై అవగాహన పొందారని తెలిపారు.

ఆర్‌జీఎన్ ఉమెన్ రైట్స్ సభ్యులు ఈ సమస్యను సమగ్రంగా లీగల్ టీంకు వివరించగా, కేసును న్యాయపరంగా ఎదుర్కొని బాధితులకు న్యాయం జరగేలా చూడనున్నట్లు హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా లీగల్ టీమ్ సభ్యురాలు సౌజన్య, కర్మనఘాట్ కాలనీ సభ్యులకు ఈ సమస్యను పరిష్కరించేందుకు పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు సంఘం అండగా ఉంటుందని నేషనల్ సెక్రటరీ శ్రీనివాస్ రాథోడ్ హామీ ఇచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment