- రబింద్రా పాఠశాలలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీలు
- వాలీబాల్, కబడ్డీ, చెస్, బాస్కెట్ బాల్, ఖోఖో తదితర క్రీడలు
- గెలిచిన విద్యార్థులకు జనవరి 26న బహుమతులు అందజేత
- పాఠశాల ప్రిన్సిపాల్ సాయినాథ్, కరస్పాండెంట్ రాజేందర్ ముఖ్య వ్యాఖ్యలు
ముధోల్‌లోని రబింద్రా పాఠశాలలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రీడా పోటీలు నిర్వహించారు. వాలీబాల్, కబడ్డీ, చెస్, బాస్కెట్ బాల్, ఖోఖో వంటి క్రీడల్లో విద్యార్థులు పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ సాయినాథ్ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు. గెలిచిన విద్యార్థులకు జనవరి 26న బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు.
రబింద్రా పాఠశాలలో ఆటల పోటీలు ఘనంగా నిర్వహణ
76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముధోల్ మండలంలోని రబింద్రా పాఠశాలలో విద్యార్థుల కోసం క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రిన్సిపాల్ అసంవర్ సాయినాథ్ నేతృత్వంలో నిర్వహించారు. వాలీబాల్, కబడ్డీ, చెస్, బాస్కెట్ బాల్, ఖోఖో వంటి క్రీడల్లో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు.
ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ సాయినాథ్ మాట్లాడుతూ, క్రీడలు విద్యార్థులలో ఆరోగ్యం, క్రమశిక్షణ, మానసిక శక్తి పెంపుదలకు దోహదపడతాయని తెలిపారు. ఈనెల 26న గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేయనున్నట్లు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రాజేందర్, డైరెక్టర్ పోతన్న యాదవ్, చైర్మన్ భీమ్ రావు దేశాయ్, ఉపాధ్యాయులు, మరియు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.