సీఎంను కలిసిన రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్

Alt Name: CMతో మధుసూదన్ రెడ్డి
 

సీఎంను కలిసిన రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్

M4 న్యూస్, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి
అక్టోబర్ 11:

రంగారెడ్డి జిల్లా నూతన గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గా నియమితులైన ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, గురువారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్ఛం అందజేశారు. తనపై నమ్మకం ఉంచి గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా, మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని గ్రంథాలయాలను అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ప్రభుత్వం ఈ పదవీ ఇవ్వడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

మరియు, కష్టపడి ప్రజల మన్ననలు పొందుతూ వారికి సహాయం చేయడానికి తాను కృషి చేస్తానని, పేద ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా, వెనువెంట ఉండి వారికి సాయపడేందుకు ముందుంటానని ఎలుగంటి మధుసూదన్ రెడ్డి తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment