రేపే ED విచారణ.. సమయం కావాలంటున్న రానా!
బెట్టింగ్ యాప్స్ కేసులో ఈనెల 23న సినీ నటుడు దగ్గుబాటి రానా ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే, రేపు షూటింగ్ ఉన్నందున విచారణకు హాజరు కాలేనని, సమయం కావాలని రానా ఈడీని కోరినట్లు తెలుస్తోంది. నటులు ప్రకాష్ రాజ్ జూలై 30న, విజయ్ దేవరకొండ ఆగస్టు 6న, మంచు లక్ష్మీ ఆగస్టు 13న ఈడీ విచారణకు హాజరుకానున్నారు