రామకృష్ణాపూర్: సైబర్ మోసానికి గురైన మహిళ
రామకృష్ణా పూర్ కు చెందిన ఒక మహిళ ఫేస్‌బుక్ లో వర్క్ ఫ్రొం హోం పార్ట్ టైం ఉద్యోగం చూసి లింకును ఓపెన్ చేయడంతో సైబర్ నేరగాళ్ల వలలో చిక్కింది. నేరగాళ్లు లాభాలు వస్తాయని ఆశ చూపించి ఆమె వద్ద నుండి ఐదు లక్షలు కాజేశారు. తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఎస్సై రాజశేఖర్ సోమవారం ఈ వివరాలను తెలిపారు