M4News ప్రతినిధి
📍 రామగుండం | జనవరి 06, 2025
🔹 పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
🔹 ముగ్గురు పేకాట రాయుళ్ల అరెస్ట్ – ₹13,120 నగదు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం
🔹 ఐదుగురు జూదగాళ్లు పరారీ
రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎం. శ్రీనివాస్ ఐపీఎస్ (ఐజి) ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సీఐ రాజ్ కుమార్, ఎస్ఐలు ఉపేందర్, లచ్చన్న ఆధ్వర్యంలో లక్షేట్టిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోదెల గ్రామం పత్తి చేను ప్రాంతంలో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై ఆకస్మిక దాడి నిర్వహించారు.
ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి ₹13,120 నగదు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారు.
అరెస్టైన నిందితుల వివరాలు:
1️⃣ రావుల రవి (45) – కూలి, గంపలపల్లి, లక్షేట్టిపేట్
2️⃣ తనుగుల ప్రశాంత్ (32) – కూలి, గంపలపల్లి, లక్షేట్టిపేట్
3️⃣ ఎగ్గడి సత్తయ్య (50) – కూలి, గంపలపల్లి, లక్షేట్టిపేట్
పరారీలో ఉన్నవారు:
4️⃣ రావుల మహేష్
5️⃣ బలరాం
6️⃣ నల్లాపు తిరుపతి
7️⃣ రమేష్
8️⃣ కుమ్మరి మహేష్
పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.