విద్యార్థి ప్రాణం తీసిన పబ్జి ఆట
బైంసా పట్టణంలోని ఆనంద్ నగర్లో విషాద ఘటన
భైంసా మనోరంజని ప్రతినిధి ఆగస్టు 21
పబ్జీ గేమ్ కు బానిసగా మారిన విద్యార్థి ఒకరు ప్రాణం తీసుకున్న విషాదకర ఘటన బుధవారం బైంసాలోని అనందనగర్ కాలనీలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లోని మౌళాలి ప్రాంతానికి చెందిన బేతి సంతోష్, సాయిప్రజ దంపతులు గత కొంత కాలంగా భైంసాలోని ఆనంద నగర్ కాలనీ పరిధిలో నివాసముంటూ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు బేతి రిశేంద్ర హైదరాబాద్ లోని భాష్యం స్కూల్లో తొమ్మిదవ తరగతి పూర్తి చేసుకొని పదవ తరగతిలో చేరాల్సి ఉంది. అయితే బేతి రిశెంద్ర గత కొంత కాలంగా పబ్జి గేమ్ కు బానిసగా మారాడు. వేసవి కాలం నుంచి పబ్జి గేమ్ ఆట ఆడటానికే పరిమితమయ్యాడు. పాఠశాలకు వెళ్లకుండా అదే తంతుగా గేమ్ మత్తు మాయలో పడి ప్రాణానికి ముప్పు తెచ్చుకున్నాడు. ఇదే క్రమంలో చదువుపై నిర్లక్ష్యం చేసి పదవ తరగతి కోసం పాఠశాలకు వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాడు. తల్లితండ్రులు ఎన్ని విధాలుగా నచ్చ చెప్పిన చదువు పై ద్యాస పెట్టకుండా సమయమంతా పబ్జి ఆట ఆడటంలోనే గడిపేవాడు. పబ్జీ ఆటకు బానినగా మారిన కుమారుడిలో మార్పు తెచ్చి చదువుపై దృష్టి పెట్టి దిశగా తల్లితండ్రులు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలితం కానరాలేదు. చివరి ప్రయత్నంగా గత రెండు మూడు రోజుల నుంచి కుమారుడికి కుటుంబీకులు పబ్జీ గేమ్ ఆడకుండా కట్టడి చేసినట్లుగా తెలిసింది. దీంతో డిప్రెషన్ కు లోనైన సదరు విద్యార్థి మనస్థపం, ఆవేశం చెంది బుధవారం సాయంత్రం వేళలో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బైంసా పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేపట్టారు. మృతదేహన్ని పోస్టుమార్గం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.