నిషేధిత గుడుంబా పట్టివేత.
మనోరంజని, మంచిర్యాల జిల్లా ప్రతినిధి.
భీమారం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో 10 లీటర్ల గుడుంబాను పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం ఉదయం 7:00 గంటల ప్రాంతం లో పులిమడుగు గ్రామానికి చెందిన కుంసోత్ వెంకటేష్ అను వ్యక్తి తన ఆటో లో ప్రభుత్వం చే నిషేధించబడిన గుడుంబానీ తరలిస్తున్నారని ముందస్తు సమాచారం మేరకు భీమరo ఎస్సై కె. శ్వేత తన సిబ్బంది మహేందర్, సంతోష్ మరియు ఎక్సైజ్ ఎస్సై శంకర్ మరియు సిబ్బంది రాజేంద్ర ప్రసాద్.ప్రసాద్.మహేష్ తో కలిసి ఉమ్మడి ఆపరేషన్ నిర్వహించి చాకచక్యంగా పట్టుకొని అతని వద్ద నుండి సుమారు 10 లీటర్ లు దాని విలువ 4000 రూ. అక్రమంగా తరలిస్తుండగా భీమారం గ్రామం లోని ఎస్సీ కాలనీ వద్ద వెంబడించి పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకొని ఆటో తో పాటు గుడుంబని స్వాధీన పరుచుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు .ఈ సందర్భంగా భీమారం ఎస్సై కె.శ్వేత మాట్లాడుతూ గుడుంబా తయారు చేసిన,లేదా దాన్ని రవాణా చేసిన వారు ఎవ్వరిని వొదిలే ప్రసక్తి లేదని..చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు