రాష్ట్రంలో మొట్టమొదటిసారి సైబర్ నేరాల మీద ప్రివెంటివ్ డిటెన్షన్ ( పి.డి ) యాక్ట్ కేసు నమోదు*

రాష్ట్రంలో మొట్టమొదటిసారి సైబర్ నేరాల మీద ప్రివెంటివ్ డిటెన్షన్ ( పి.డి ) యాక్ట్ కేసు నమోదు*

*నిజామాబాద్ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవు*

*చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎవ్వరయిన తమ పద్ధతులను మార్చుకోవాలి*

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్., వెల్లడి

మనోరంజని తెలుగు టైమ్స్ నిజామాబాద్ ప్రతినిది అక్టోబర్ 11

తరుచు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ, దొంగతనాలకు పాల్పడుతూ, ప్రజలలో తరచు భయాందోళలను కలిగించే వారిపై సాధారణంగా చట్ట ప్రకారం చర్యతీసికోవడం జరుగుతుంది. వారు మరోకసారి అటువంటి నేర ప్రవృత్తికి పాల్పడకుండా కేసులు వేసి కోర్టుల ద్వారా శిక్షించడం జరుగుతుంది. అయినప్పటికీ కొంత మంది తమ ప్రవృత్తిని మార్చుకోకుండా తిరిగి అదే తరహ నేరాలకు పాల్పడుతూ సమాజానికి ఒక చీడపురుగులా మారతారు. ఇటువంటి నేరస్థులు భయట ఉంటే సమాజానికి నష్టం జరుగుతుంది. అందుకే వీరిని కొంతకాలం పాటు బయటకి రాకుండా నిరోధించడానికి ” *ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాన్ని* ” ఉపయోగించడం జరుగుతుంది. ఈ చట్టం క్రింద గత తరచు నేరాలకు పాల్పడే వారిని నిర్ణీత సంఖ్యలో నేరాలు చేసి సమాజానికి ప్రమాదకరంగా పరిణమించిన వారిపై సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారి గారి రిపోర్టు మేరకు పోలీస్ కమీషనర్ ” *ప్రివెంటివ్ డిటెన్షన్*” ఉత్తర్వుల ను జారీచేస్తారు.ఈ ప్రక్రియలో భాగంగా తరుచు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తు,దొంగతనాలకు పాల్పడుతు ప్రజలలో తరుచు బయాందోళనకు కలిగిస్తున్న వారు కానీ, ఈ మద్య కాలంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలోని కొంత మంది నిరుద్యోగ యువతకు కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తాము అని నమ్మబలికి లావోస్, థాయిలాండ్ దేశాలకు పంపించి అక్కడ సైబర్ నేరాలకు పాల్పడేలా బలవంతం చేస్తున్న వ్యక్తిని నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసుల సమాచారం ప్రకారం సైబర్ నేరాలు చేయిస్తున్న నిందితుడు యువతకు మంచి ఉద్యోగాలు, అధిక వేతనాలు ఇస్తామని చెప్పి వారిని లావోస్, థాయిలాండ్ దేశాలకు పంపించేవాడు. అక్కడకు వెళ్లిన తర్వాత వారి పాస్పోర్టులు స్వాధీనం చేసుకుని చట్ట విరుద్దమైన సైబర్ మోసాలకు బలవంతంగా పని చేయిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కోలనాటి నాగశివ తండ్రి పేరు సత్యనారాయణ రాజు కోలనాటి, వయస్సు 36 సం||,ప్రస్తుతం ఇంటి నెంబర్ 6-264/3/4/6/ఎ, వెంకటేశ్వరకాలనీ, సుచిత్ర, జీడిమెట్ల, తెలంగాణ, ఇతనిపై పలువురు బాధితుల నుంచి ఫిర్యాదులు రాగా 4 కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తోందని, *ఇందుకు గాను ప్రధాన సూత్ర దారుడైన కోలనాటి నాగశివ పై తేది: 13-9-2025 నాడు, పి.డి యాక్ట్ -1986 తెలంగాణ ( ప్రివెన్షన్ డిటెన్షన్ ) ను ప్రయోగించి ఇతనిని చెంచల్ గూడా జైలుకు తరలించడం జరిగిందని తెలిపారు*. అదే విధంగా నిజామాబాద్ జిల్లా నుండి జారీ చేసిన ప్రివెన్షన్ డిటెన్షన్ (పి.డి) ఆర్డర్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కన్ఫర్మేషన్ చేస్తుంది అని తెలియజేయడం జరిగింది.కాబట్టి సమాజంలో మట్కా, గుట్కా, గ్యాంబ్లింగ్ మరియు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎవ్వరయిన తమ పద్దతులను మార్చుకోవాలని, ఎవ్వరూకూడా చట్టానికి విరుద్దముగా వ్యవహరించరాదని ఆ విధంగా చట్టానికి విరుద్ధముగా వ్యవహారించే వారి సమాచారం సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి సమాచారం ఇవ్వగలరు. సమాచారం ఇచ్చిన వారి వివరములు గోప్యంగా ఉంచబడును. ప్రస్తుతానికి నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలలో గల అన్ని పోలీస్ స్టేషన్లలో నేరస్థుల వివరాలను వెలికితీయాలని అన్ని పోలీస్ స్టేషన్ ఎస్. హెచ్.ఓ లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్, సమాజంలోని ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వారిని మరియు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిని, సమాజ శాంతికి భంగం కలిగించే వారిపైన ” నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసినాము మరియు అట్టి వారిపై పి.డియాక్టు చట్టం క్రిందికి తీసుకురావడం జరుగుతుందని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment