సారంగాపూర్, 15 July
నిర్మల్ జిల్లా సారంగాపూర్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని మార్చాలని మండల కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి తమ మనోభావాలను వెల్లడించారు. పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. కొత్తగా నియమించిన అధ్యక్షుడిపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.
నిర్మల్ జిల్లా సారంగాపూర్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని మార్చాలని మండల కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం తమ అభిప్రాయాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు.
పార్టీ పదవికి దరఖాస్తు చేసుకోని పెల్లి మాధవ్ రావును నియమించడం ఏమిటని వారు ప్రశ్నించారు. అధిష్టానం ఈ విషయంలో పునరాలోచించాలని వారు భావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మెన్ అబ్ధుల్ హాది, మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భోల్లోజి నర్సయ్య, పోత రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మెన్ లు రాజ్ మహమ్మద్, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, దశరథ రాజేశ్వర్, ఏనుగు ముత్యం రెడ్డి, భూమారెడ్డి, మధుకర్, నవీన్ రెడ్డి, మాయరాం, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.












