సారంగాపూర్, జులై 15
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొత్త పెల్లి మాధవ్ రావు నియామకంపై పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు ఇవ్వాలని, ప్రస్తుత నియామకంపై అధిష్టానం పునరాలోచించాలని వారు డిమాండ్ చేశారు.
నిర్మల్ జిల్లా, సారంగాపూర్: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని మార్చాలని బుధవారం మండల కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి తమ మనోభావాలను వెల్లడించారు. పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు ఇవ్వాలని అధిష్టానాన్ని వారు కోరారు.
పార్టీ పదవికి దరఖాస్తు చేసుకొన్న వారిలో కొత్తగా పెల్లి మాధవ్ రావుని నియమించడం ఏమిటని వారు ప్రశ్నించారు. అధిష్టానం ఈ విషయంపై పునరాలోచించాలని వారి భావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మెన్ అబ్ధుల్ హాది, మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భోల్లోజి నర్సయ్య, పోత రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మెన్ లు రాజ్ మహమ్మద్, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, దశరథ రాజేశ్వర్, ఏనుగు ముత్యం రెడ్డి, భూమారెడ్డి, మధుకర్, నవీన్ రెడ్డి, మాయరాం తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.












