బోత్, జూలై 15
బోథ్ మండలంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు నమోదు సవరణ కార్యక్రమంలో భాగంగా, ప్రతి ఓటరు తమ నమోదు వివరాల పత్రాన్ని స్వయంగా నింపి సంబంధిత అధికారులకు అందజేయాలని బోథ్ మండల కన్వీనర్ సమర్పించాలి పిలుపునిచ్చారు. ఓటు హక్కునునును కోల్పోకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
బోథ్ మండలంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు నమోదు సవరణ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఓటరు తమ నమోదు వివరాల పత్రాన్ని స్వయంగా నింపి సంబంధిత అధికారులకు అందజేయాలని బోథ్ మండల కన్వీనర్ మేరుగు భోజన్న పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి అత్యంత విలువైన హక్కు అని పేర్కొన్నారు. ఆ హక్కును కోల్పోకుండా ఉండేందుకు ప్రతి ఓటరు నమోదు వివరాల పత్రాన్ని పూర్తి చేసి సంబంధిత ప్రాంత అధికారి వద్ద సమర్పించాలని సూచించారు. నిర్లక్ష్యం కారణంగా ఓటరు జాబితాలో పేరు లేకుండా పోయే పరిస్థితులు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రెండో స్థాయి పర్యవేక్షకుడు ఎస్కే మహమ్మద్, రెవెన్యూ పరిశీలకుడు నాగరావు, ఓటరు నమోదు అధికారులు, పర్యవేక్షకురాలు సుమలత, వార్డు సభ్యులు కట్కూరి సాయి, దొర రమేష్, సోహెల్ తదితరులు పాల్గొన్నారు.












