Nirmal/Sarangapur (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 31
సారంగాపూర్ మండల కేంద్రంలో, కాంగ్రెస్ కార్యాలయంలో సొసైటీ చైర్మన్ నారాయణరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు.
నిత్యం ప్రజా శ్రేయస్సు కోసం పరితపించే సొసైటీ చైర్మన్ నారాయణరెడ్డి జన్మదిన వేడుకలు సారంగాపూర్ మండల కేంద్రంతో పాటు కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, అధికారులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు.
మండల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ప్రజల కోసం నిరంతరం శ్రమించే నారాయణరెడ్డి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












