వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా బాధ్యతలు స్వీకరించి 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మిర్యాలగూడలో ప్రత్యేక వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయనను పలువురు అభినందించారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బాల్ శెట్టి మధుబాబు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రజా సేవలో 40 ఏళ్లు పూర్తి చేసుకోవడాన్ని పురస్కరించుకొని రైతులతో కలిసి కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా, తుమ్మల నాగేశ్వరరావు పలువురు ముఖ్యమంత్రులతో కలిసి పనిచేస్తూ, నిరంతరాయంగా ప్రజా సేవలో కొనసాగిన తీరును పలువురు గుర్తు చేసుకున్నారు. ఆయన సేవలను ప్రశంసించారు.
మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ అవంతిపురం వద్ద జరిగిన ఈ వేడుకల్లో, ఉద్యోగులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని మంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు.
మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ ఎం వెంకన్న, సూపర్వైజర్లు శ్రీహరి, శ్రీకాంత్, సుజాత, ఉమా, స్రవంతి, సిబ్బంది చెన్నా నాయక్, షమీం, పురం రవి, నాగార్జున చారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.












