మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 17
TPCC వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై రిటర్నింగ్ ఆఫీసర్ (RO) నిర్ణయమే అంతిమమని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ నుంచి పోటీ చేసిన ఆమె నామినేషన్ ను RO తిరస్కరించారు.
TPCC వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అంశంలో రిటర్నింగ్ ఆఫీసర్ (RO) నిర్ణయమే అంతిమమని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు.
రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా మధ్యప్రదేశ్ నుంచి పోటీ చేసిన ఆమె నామినేషన్ ను RO తిరస్కరించిన విషయం తెలిసిందే. దీనిపై మీనాక్షి నటరాజన్ మొదట సుప్రీంకోర్టును, ఆ తర్వాత ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు.
తాజాగా ఈ విషయంపై స్పందించిన సీఈసీ జ్ఞానేశ్ కుమార్, 'నామినేషన్ ఫారంలో కోర్టు కేసు వివరాలను నింపాలని మీనాక్షి నటరాజన్ కు సమయం ఇచ్చినా ఆమె పూర్తి చేయలేదు. RO తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది' అని తెలిపారు.











