నిర్మల్, 2026-07-17
లక్ష్మణచాంద మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న సమగ్ర ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు శుక్రవారం పరిశీలించారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా అధికారులు పారదర్శకంగా విధులు నిర్వహించాలని ఆయన సూచించారు.
లక్ష్మణచాంద మండలం కనకాపూర్, రాచపూర్, లక్ష్మంచాందా, మునిపెల్లి గ్రామాల్లో కొనసాగుతున్న సమగ్ర ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు శుక్రవారం పరిశీలించారు.
బూత్ స్థాయిలో జరుగుతున్న నమోదు, సవరణ, మార్పులు, చేర్పుల ప్రక్రియను పరిశీలించి అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. బీఎల్ఓలకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఓటరు నమోదు ప్రక్రియను నూటికి నూరు శాతం పూర్తిచేసిన రాచాపూర్ బీఎల్ఓలను మరియు బీఎల్ఏలను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.
అనంతరం మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా అధికారులు పారదర్శకంగా విధులు నిర్వహించాలని సూచించారు. అలాగే అర్హులైన వారు తమ పేర్లు ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడంతో పాటు, వివరాల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే సకాలంలో సవరించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఒక్కరూ ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కొండు నరేష్ రెడ్డి, వయసు ఏఎంసీ చైర్మన్ ఈటెల శ్రీనివాస్, అబ్బడి ప్రతాపరెడ్డి, రాచాపూర్ సర్పంచ్ మహేష్, ఎంబడి రాకేష్, గాజుల రవికుమార్, కొట్ట శేఖర్, గంగాధర్ గౌడ్, నారాయణ, గుర్రం లింగారెడ్డి, చింతకింది శేఖర్ రెడ్డి, నల్ల రాజశేఖర్ రెడ్డి, రాజారెడ్డి, గుర్రాల దేవేందర్ రెడ్డి, పార్పెల్లి నర్సారెడ్డి, సమ్మెట రవి పాల్గొన్నారు.











