భైంసా, జూలై 15
కుంటాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా లింబా (కే) గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఆనందరావు పాటిల్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ షిందే ఆనందరావు పాటిల్ ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం అందుకున్నారు.
కుంటాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా లింబా (కే) గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఆనందరావు పాటిల్ ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా బుధవారం భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో నూతన అధ్యక్షుడు ఆనందరావు పాటిల్, మార్కెట్ కమిటీ చైర్మన్ షిందే ఆనందరావు పాటిల్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ నూతన మండల అధ్యక్షుడిని శాలువాతో సన్మానించారు.
అనంతరం చైర్మన్ ఆనందరావు పాటిల్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలతో కలిసి కృషి చేయాలని సూచించారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












