(బి) (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 08
మండలంలోని ఝరి (బి) గ్రామంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఓటరు సర్వేను బుధవారం తహశీల్దార్ మహేంద్రనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.
మండలంలోని ఝరి (బి) గ్రామంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఓటరు సర్వేను బుధవారం తహశీల్దార్ మహేంద్రనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న సర్వే తీరును ఆయన స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ, పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పన కోసం ప్రతి ఒక్కరూ సర్వేకు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను నమోదు చేసుకుని ఓటరు సర్వేను విజయవంతంగా పూర్తి చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ అధికారి రజిత, బూత్ స్థాయి అధికారి మైనాబాయి, కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి ప్రతినిధి గైక్వాడ్ సాయినాథ్ ఝరి తదితరులు పాల్గొన్నారు.












