మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 08
ప్రజల సంక్షేమమే పరమావధిగా జీవితాంతం కృషి చేసిన మహోన్నత ప్రజా నాయకుడు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. జూలై 8న వైయస్ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్నారు. నిరుపేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, బలహీన వర్గాల అభ్యున్నతికి వైయస్ అమలు చేసిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు.
ప్రజలే తమ కుటుంబమని భావించి, వారి సంక్షేమమే పరమావధిగా జీవితాంతం కృషి చేసిన మహోన్నత ప్రజా నాయకుడు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. జూలై 8న వైయస్ జయంతిని పురస్కరించుకొని ఆయనను స్మరించుకున్నారు.
నిరుపేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా వైయస్ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. రైతు సంక్షేమం, ఉచిత విద్యుత్, ఆరోగ్య సేవల విస్తరణ, విద్యా ప్రోత్సాహం, సామాజిక న్యాయం వంటి రంగాల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు చిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు.
ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు, ప్రజాసేవ పట్ల ఆయన అంకితభావం, మానవతా దృక్పథం నేటికీ కోట్లాది మందికి స్ఫూర్తినిస్తున్నాయని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.











