వనపర్తి, జూలై 27
ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఓటు హక్కు వజ్రాయుధమని, అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ఆయన విస్తృతంగా పర్యటించి పరిశీలించారు. పారదర్శకమైన ఓటరు జాబితాతోనే బలోపేతమైన ప్రజాస్వామ్యం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఓటు హక్కు వజ్రాయుధమని, అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ఆయన విస్తృతంగా పర్యటించి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారదర్శకమైన ఓటరు జాబితాతోనే బలోపేతమైన ప్రజాస్వామ్యం సాధ్యమవుతుందని అన్నారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో బీఎల్ఓలు, బీఆర్ఎస్ బీఎల్ఏలు, పార్టీ శ్రేణులు చురుకుగా పాల్గొని అర్హులైన ప్రతి ఓటరు తుది జాబితాలో ఉండేలా కృషి చేయాలని సూచించారు.
పట్టణంలో మొత్తం 63,246 మంది ఓటర్లు ఉండగా, సుమారు 20 వేల మంది ఓటర్లు గ్రామాలకు తరలివెళ్లే అవకాశం ఉందని తెలిపారు. వాస్తవంగా పట్టణంలో నివసిస్తున్న అర్హులైన ఓటర్ల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయించి, ఓటరు జాబితా సవరణ ప్రక్రియను వంద శాతం పూర్తి చేసి పట్టణాన్ని ఆదర్శంగా నిలపాలని కోరారు.
ప్రతి బూత్‌లో చురుకుగా పనిచేస్తున్న బీఎల్ఓలు, బీఎల్ఏలు, బీఆర్ఎస్ శ్రేణులను నిరంజన్‌రెడ్డి అభినందించి సన్మానించారు. అనంతరం కౌన్సిలర్ భారతి ప్రేమ్‌నాథ్‌రెడ్డి నివాసంలో భోజనం చేసిన ఆయన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు పలుస రమేష్‌గౌడ్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, పట్టణ ప్రధాన కార్యదర్శి గంధం పరంజ్యోతి, కౌన్సిలర్ మురళీ సాగర్ తదితరులు పాల్గొన్నారు.












