************ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 27
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తన ముఖ్య అనుచరుడు, మాజీ సుడా డైరెక్టర్ కీ" శే" కోసూరి రమేష్ గౌడ్ దశ-దిన కర్మకు హాజరయ్యారు. రమేష్ గౌడ్ చిత్రపటానికి పుష్పాలు వేసి శ్రద్ధాంజలి ఘటించి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు.
కీ" శే" కోసూరి రమేష్ గౌడ్ గారి చిత్రపటానికి పుష్పాలు వేసి శ్రద్ధాంజలి ఘటించిన మాజీ ఎమ్మెల్సీ బాలసాని.
తన ముఖ్య అనుచరుడు, ఇటీవల కాలంలో పరమపదించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ సుడా డైరెక్టర్ క్రీ" శే" కోసూరి రమేష్ గౌడ్ గారి దశ-దిన కర్మకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ హాజరయ్యారు. రమేష్ గౌడ్ గారి చిత్రపటానికి పుష్పాలు వేసి శ్రద్ధాంజలి ఘటించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్టకాలంలో వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆయన ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ ఎండి ఖాదర్ బాబా, తాజా మాజీ మేయర్ పూనుకొల్లు నీరజ రాంబ్రహ్మం, జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి వాలబోయిన వెంకటేశ్వర్లు, ఉద్యమకారుల ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ రడం సురేష్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు రుద్ర గాని ఉపేందర్, నీలం కృష్ణ, మంజర్లపాటి హనుమంత రెడ్డి, నెల్లూరి చిన్న కొండయ్య, షేక్ జానీ, వల్లూరి మల్యాద్రి, మారోజు రాజు చారి, మక్తాల సుధాకర్, చింతల మల్లేశం, షేక్ షబ్బీర్, తాళ్లూరి శ్రీనివాస్ చౌదరి, బెల్లంకొండ శ్రీనివాస్ రావు, తెనాలి వీరబాబు, పాటి శంభారెడ్డి, కట్టికల శ్రీనివాస్ రెడ్డి మరియు 58వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు మున్నేన జగన్, ఎడ్ల శేషగిరి, షేక్ వలీ భాయ్, ముడుసు అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.












