కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేనిపక్షంలో ఎక్కడికక్కడ నిలదీస్తామని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.
నిర్మల్ పట్టణానికి చెందిన 344 మంది, నిర్మల్ రూరల్ కు చెందిన 147 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముభారక్ చెక్కులను ఆయన గురువారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో పెళ్ళైన ఆడబిడ్డలకు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, కానీ ఇప్పుడు ఆ హామీలను విస్మరించిందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ, ఆ దిశగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.












