*👉 (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 21
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి ఆ పార్టీ అండగా నిలిచింది. ఇటీవల మరణించిన మండల కాంగ్రెస్ నాయకులు పడిగా సమ్మయ్య గారి మాతృమూర్తి పడిగా ముసలమ్మ దశదిన కర్మల నిమిత్తం పార్టీ నాయకులు బియ్యం అందజేశారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి ఆ పార్టీ అండగా నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం, పద్మాపురం గ్రామానికి చెందిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పడిగా సమ్మయ్య గారి మాతృమూర్తి పడిగా ముసలమ్మ ఇటీవల మరణించారు. వారి దశదిన కర్మల నిమిత్తం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ 50 కేజీల బియ్యాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.
అదేవిధంగా, మండల నాయకులు గొగ్గలి రవి, జలగం కృష్ణ కలిసి 25 కేజీల బియ్యాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తోలెం రమేష్, నాయకులు అరెం నరసింహారావు, md.హకీం, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువకులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.












