ఖానాపూర్, జూలై 21
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే 84వ జన్మదిన వేడుకలు ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే శిబిర కార్యాలయంలో మంగళవారం ఘనంగా జరిగాయి. నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఈ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే 84వ జన్మదిన వేడుకలను ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే శిబిర కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఖానాపూర్ శాసనసభ్యుడు వెడ్మ బొజ్జు పటేల్ హాజరై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న నాయకుడిగా ఖర్గే సేవలు ప్రశంసనీయమని అన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షుతో ఉండాలని ఆకాంక్షించారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











