నిర్మల్, July 21
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎంకే మున్నూరు కాపు సంఘం భవనంలో మంగళవారం, జులై 21న నిర్మల్ జిల్లా యువజన కాంగ్రెస్ కార్యనిర్వాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సమరసింహారెడ్డి అధ్యక్షత వహించారు. రానున్న రోజుల్లో యువతను ప్రోత్సహించి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎంకే మున్నూరు కాపు సంఘం, బుధవార్ పేట్ లోని భవనంలో మంగళవారం, జులై 21న నిర్మల్ జిల్లా యువజన కాంగ్రెస్ కార్యనిర్వాహక సమావేశం జరిగింది. నిర్మల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సమరసింహారెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మరియు ఏఐసీసీ ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో యువతను ప్రోత్సహించి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా యువజన, నిర్మల్ పట్టణ, మండలాల యువజన అధ్యక్షులు, సోషల్ మీడియా కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.











