లోకేశ్వరం, 3 September
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు మండల కేంద్రంలో గురువారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ పోరుబాట ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయాలి: విలాస్ గాదెవార్ , సెప్టెంబరు 3 ( కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు ముధోల్ నియోజకవర్గంలోని మండల కేంద్రంలో గురువారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. రైతులు, మహిళలు, యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు విలాస్ గాదెవార్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని అన్నారు.అనంతరం **‘కాంగ్రెస్ బాకీ కార్డు’**లను ప్రజలకు పంపిణీ చేశారు. అమలు కాని హామీలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.












