మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 04
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి నియోజకవర్గంలో శుక్రవారం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో సదస్సులు, వంటా వార్పు కార్యక్రమాలు చేపట్టారు.

అల్వాల్ లేబర్ అడ్డా వద్ద నిర్వహించిన నిరసనలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజులు పూర్తయినా ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. మహిళలు, వృద్ధులు, వికలాంగులు, విద్యార్థులు, పేదలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్లు శ్రీమతి చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబితా అనిల్ కిషోర్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, తోట నరేందర్ రెడ్డి, నేమురి శ్రీధర్ గౌడ్, డోలి రమేష్, ఢిల్లీ పరమేష్, శరణ గిరి, భాస్కర్ రెడ్డి, శోభన్ బాబు, శ్రీనివాసులు, సురేష్, అరవింద్, అరుణ్, పుట్నాల కృష్ణ, ముత్యాలు, సత్తయ్య, వీరేశం, తాజుద్దీన్, ప్రకాష్, భాస్కర్ గౌడ్, యాదగిరి గౌడ్, సందీప్, రాజు, మహేందర్, పవన్, ప్రశాంత్ రెడ్డి, జవీద్, మహేష్, గణేష్, ప్రభాకర్, సురేష్, అంజయ్య, నర్సింగ్ రావు, ప్రేమ్, సాజిద్, శిల్ప, నందిని, రేణుక, రాణి, రమాదేవి, సరిత, హరిత, వర్ష, వీణ, సులోచన, అర్చన, సాయిలత, ముత్తులక్ష్మి, వాణిశ్రీ, వాణి, మాధవి, ఈశ్వరి, హారిక, రాధ, నాజియా, లక్ష్మీ, శ్వేత, స్టెల్లా, అన్నపూర్ణ, సింధు, నాగమణి, అరుణ, కళా తదితరులు పాల్గొన్నారు.