ఆలూరు, 4 September
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆలూరు మండలంలో వంటావార్పు కార్యక్రమం, సదస్సులు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు.
వెయ్యి రోజుల కాంగ్రెస్ దగా పాలనపై బీఆర్ఎస్ సమరభేరి హామీల అమలులో వైఫల్యాన్ని నిరసిస్తూ వంటా–వార్పు, సదస్సులు ఆర్మూర్ కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మండలంలో వంటా–వార్పు కార్యక్రమం, సదస్సులు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావుతో కలిసి ఈ కార్యక్రమాలను చేపట్టారు.ఈ కార్యక్రమానికి మహిళలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని, కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం ఇస్తామని, మహిళలకు స్కూటీలు అందిస్తామని, కేసీఆర్ కిట్‌కు ప్రత్యామ్నాయంగా పలు ప్రయోజనాలు కల్పిస్తామని హామీలు ఇచ్చిందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు.అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని వారు విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, మహిళలకు ఇచ్చిన హామీలు ఎక్కడ అమలవుతున్నాయని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని నాయకులు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రానున్న రోజుల్లో మరిన్ని నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.












