*జువ్వాడలోని రాజ్ పాకాల ఫామ్ హౌస్ పై పోలీసుల దాడి*
ఎమ్4 న్యూస్ ప్రతినిధి*
హైదరాబాద్:అక్టోబర్ 27
హైదరాబాద్ జువ్వాడలోని ఓ ఫామ్ హాజ్ పై సైబరాబాద్ SOT ఈరోజు తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. జువ్వాడ రిజర్వ్ కాలనీలో ఉన్న ఫామ్ హౌస్ బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి బామ్మర్ది రాజ్ పాకాల దిగా పోలీసులు గుర్తించినట్లుగా సమాచారం.
నర్సింగ్ పోలీసుల తో పాటు వీఐపీల రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. జన్వాడలోని ఓ ఫామ్‌హౌస్‌లో.. రేవ్ పార్టీ జరుగుతున్న చోటి నుంచి భారీగా డీజే శబ్దాలు రావడంతో, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దాంతో ఆ ఫామ్‌హౌస్‌పై స్పెషల్ పార్టీ, సైబరాబాద్, SOT పోలీసులు దాడి చేశారు. రేవ్ పార్టీలో దొరికిన వారికి టెస్టులు చేయించారు. పార్టీలో పాల్గొన్న వ్యాపారవేత్త విజయ్ మద్దూరికి కొకైన్ పాజిటివ్ రావడంతో.. అతణ్ని అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు ఫామ్‌హౌస్‌లో భారీగా విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. NDPS యాక్ట్, సెక్షన్ 34 ఎక్సైజ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఫామ్‌హౌస్‌పై దాడిని మాత్రం గోప్యంగా ఉంచారు..