ప్లాట్లు, భూములు కబ్జా అవుతున్నాయి, పట్టించుకోరా? సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఫైర్

సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ధర్పల్లి సమావేశం
  • ధర్పల్లి మండలంలో పేదలకు కేటాయించిన భూములు కబ్జాకు గురవుతున్నాయి
  • రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు పేదల బలహీనతను ఆసరా చేసుకుంటున్నారు
  • సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ భూముల రికవరీ కోరుతూ ఉద్యమంలోకి

: సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ధర్పల్లి మండలంలో పేదలకు కేటాయించిన ప్లాట్లు కబ్జాకు గురవుతున్నాయనే ఆరోపణలతో సమావేశం నిర్వహించారు. స్థానిక రెవెన్యూ అధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు నిష్క్రియాశీలతపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

: హైదరాబాద్: అక్టోబర్ 09, 2024
సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ధర్పల్లి మండల కేంద్రంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో సబ్ డివిజన్ కార్యదర్శి వి. బాలయ్య మాట్లాడుతూ, 1992లో నిరుపేదలకు కేటాయించిన భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకుల చేతిలో కబ్జా కావడం ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించారు.
ధర్పల్లి మండలంలో పేదలకు కేటాయించిన ప్లాట్లను పేదల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో, కబ్జా చేసి ఇతరులకు అమ్ముతున్నారని ఆరోపించారు. బూడల లక్ష్మి పేరుతో ఉన్న ప్లాట్లను పేక్ సర్టిఫికెట్లతో విక్రయించినా, రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం, ప్రజా ఆస్తులు రక్షించడంలో విఫలమయ్యారని బాలయ్య విమర్శించారు.

ఈ సందర్భంగా, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పేదలకు కేటాయించిన ప్లాట్ల జోలికి వెళ్లకుండా హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఇతర అధికారులు కబ్జా భూములు రికవరీ చేసి, అర్హులైన వారికి అందించాలని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment