హర్ష సాయి కేసులో మరో ట్విస్ట్
హర్ష సాయి లైంగిక వేధింపుల కేసులో కొత్త మలుపు చోటుచేసుకుంది. యూట్యూబర్ హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ, అలాగే మరో యూట్యూబర్ ఇమ్రాన్ చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. కేసులో నిందితులుగా చేర్చకముందే ఎలా బెయిల్ ఇస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ కేసులో హర్ష సాయితోపాటు, అతని తండ్రి రాధాకృష్ణ, ఇమ్రాన్ పై కూడా బాధితురాలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనతో పెళ్లి జరిపిస్తానని హర్ష సాయి వాగ్దానం చేసి మోసం చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.