హైదరాబాద్: సెప్టెంబర్ 25
ఈ నెల 28వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు సత్వర న్యాయం పొందవచ్చని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్ అన్నారు. రాజీ మార్గం ద్వారా సక్రమంగా పరిష్కారం పొందడం మాత్రమే క్షేమంగా ఉంటుందని, ఏ పద్ధతిలోనూ కక్షలు పెంచుకోవడం వల్ల నష్టాలు తప్పవని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, “రాజీమార్గమే రాజామార్గం,” అని పేర్కొన్నారు. ఈ లోక్ అదాలత్ ద్వారా క్రిమినల్ కంపౌండ బుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన నిర్వాహణ కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంకు రికవరీ, టెలిఫోన్ రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ వంటి కేసులలో కక్షిదారులు చురుకైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
అందరికీ సూచన: చిన్న చిన్న కేసులతో నిమిత్తం కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బులను వృథా చేయకుండా, లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి.