ఖలీల్ వాడి చక్ర హాస్పిటల్‌కు నోటీసులు
పోస్ట్‌మార్టం లేకుండా మృతదేహం ఇంటికి పంపిన ఘటనపై చర్య
మనోరంజని తెలుగు టైమ్స్ నిజామాబాద్ ప్రతినిధి అక్టోబర్ 15
శివాజీ నగర్‌కు చెందిన దాసరి కుటుంబానికి చెందిన వ్యక్తి గడ్డి మందు సేవించి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం ఖలీల్ వాడిలో గల చక్ర హాస్పిటల్‌కు తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మృతదేహాన్ని పోస్టుమార్టం లేకుండా నేరుగా కుటుంబానికి అప్పగించిన ఘటనపై రెండవ టౌన్ ఎస్‌హెచ్‌ఓ సయ్యద్ ముజాహిద్ స్పందించారు.
ఆ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఎటువంటి ఫిర్యాదు నమోదుకాకపోవడంతో పాటు, మృతదేహంపై సరైన ధ్రువీకరణ లేకుండా పంపిన నేపథ్యంలో, హాస్పిటల్‌కు నోటీసులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.