నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం – పెను ప్రమాదం తప్పింది

నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు
  • నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం.
  • ఆరోగ్యశ్రీ వార్డులో రోగులను సురక్షితంగా మరో వార్డుకు తరలింపు.
  • ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది.

నిర్మల్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అప్రమత్తమైన వైద్య సిబ్బంది, ఆరోగ్యశ్రీ వార్డులో ఉన్న రోగులను సురక్షితంగా మరో వార్డుకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఫర్నిచర్, ఫైల్స్ పూర్తిగా దగ్ధమయ్యాయని వైద్యాధికారులు తెలిపారు.

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం రోజు అగ్ని ప్రమాదం సంభవించింది. వివరాల ప్రకారం, ఆసుపత్రిలోని రెండవ అంతస్తులో ఉన్న ఆరోగ్యశ్రీ వార్డులో షార్ట్ సర్క్యూట్ వల్ల పొగలు కమ్ముకోవడం ప్రారంభమైంది. ఈ విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది వెంటనే అప్రమత్తమై, అక్కడ ఉన్న రోగులను సురక్షితంగా మరో వార్డుకు తరలించారు.

అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందగానే వారు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, ఈ ప్రమాదంలో వార్డులోని ఫర్నిచర్, రోగులకు సంబంధించిన ఫైల్స్ పూర్తిగా దగ్ధమయ్యాయి. వైద్య సిబ్బంది తొందరగా స్పందించడంతో పెను ప్రమాదం తప్పినట్లు అధికారులు పేర్కొన్నారు.

 

 

 

Join WhatsApp

Join Now

Leave a Comment