నవీపేట్, 14 July
అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను ప్రియుడితో కలిసి భార్య అత్యంత దారుణంగా హత్య చేసింది. శరీరాన్ని మూడు ముక్కలుగా నరికి అడవిలో పడేసిన ఈ ఘటన మహారాష్ట్రలోని నవీ ముంబైలో వెలుగులోకి వచ్చింది. దాదాపు 11 నెలల పాటు ఈ హత్యను రహస్యంగా దాచిపెట్టిన నిందితులు, ఒక చిన్న పొరపాటుతో పోలీసులకు చిక్కారు.
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో కలిసి భార్య అత్యంత దారుణంగా హత్య చేసింది. శరీరాన్ని మూడు ముక్కలుగా నరికి అడవిలో పడేసిన ఈ ఘటన మహారాష్ట్రలోని నవీ ముంబైలో వెలుగులోకి వచ్చింది. దాదాపు 11 నెలల పాటు ఈ హత్యను రహస్యంగా దాచిపెట్టిన నిందితులు, ఒక చిన్న పొరపాటుతో పోలీసులకు చిక్కారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఐరోలిలోని యాదవ్ నగర్‌కు చెందిన బలిరామ్ సూర్యనాథ్ కుష్వాహా, భార్య సునీత, ఇద్దరు పిల్లలతో కలిసి నివసించేవాడు. ఈ క్రమంలో ఘన్సోలిలో ఆటో డ్రైవర్‌గా పనిచేసే రాహుల్ దశరథ్ ప్రజాపతితో సునీతకు పరిచయం ఏర్పడి, అది ప్రేమ సంబంధంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న బలిరామ్, భార్యను మందలించి, ఆ సంబంధాన్ని వ్యతిరేకించాడు. దీంతో భర్త తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన సునీత, ప్రియుడు రాహుల్‌తో కలిసి అతడిని హత్య చేయాలని పథకం రచించింది.
2025 ఆగస్టు 9 రాత్రి, తమ ఇద్దరు పిల్లలను ఇంటి నుంచి దూరంగా పంపిన సునీత, భర్త గాఢ నిద్రలో ఉన్న సమయంలో రాహుల్‌తో కలిసి దాడి చేసింది. ముందుగా గొంతు నులిమి, అనంతరం పదునైన ఆయుధంతో హత్య చేశారు. సాక్ష్యాలను మాయం చేయడానికి ఇంట్లోనే బలిరామ్ మృతదేహాన్ని తల, మొండెం, కాళ్లు అనే మూడు భాగాలుగా నరికారు. ఆ శరీర భాగాలను వేర్వేరు సంచులు, దుప్పట్లలో చుట్టి, రాత్రి వేళ రాహుల్ ఆటోలో తీసుకెళ్లి గౌలీ దేవ్ ప్రాంతంలోని దట్టమైన పొదల్లో పడేశారు.
హత్య తర్వాత సునీత యాదవ్ నగర్‌లోని ఇంటిని అద్దెకు ఇచ్చి, తన పిల్లలతో కలిసి ప్రియుడు రాహుల్ ఇంటికి వెళ్లి నివసించడం ప్రారంభించింది. భర్త గురించి ఎవరైనా అడిగితే గొడవ జరిగి వెళ్లిపోయాడని చెబుతూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే, దాదాపు ఎనిమిది నెలల తర్వాత గ్రామం నుంచి వచ్చిన బలిరామ్ సోదరుడికి అనుమానం వచ్చింది. సోదరుడి ఆచూకీ కోసం అడగగా, సునీత చెప్పిన సమాధానాల్లో పొంతన లేకపోవడంతో, 2026 ఏప్రిల్‌లో రబాలే MIDC పోలీస్ స్టేషన్లో బలిరామ్ కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు ప్రారంభించారు. తమపై అనుమానం రాకుండా ఉండేందుకు సునీత, రాహుల్ ఇద్దరూ పాత మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులను మార్చేశారు. కానీ, వారు చేసిన ఒక చిన్న పొరపాటు కేసును ఛేదించింది. కొత్త నంబర్లు ఉపయోగిస్తున్నప్పటికీ, రాహుల్ తరచూ వివిధ మొబైల్ నంబర్ల నుంచి సునీతతో నిరంతరం మాట్లాడుతున్నట్లు కాల్ డేటా రికార్డులు (CDR) ద్వారా పోలీసులు గుర్తించారు.
ఈ కాల్ డేటాను ఆధారంగా తీసుకుని ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా, హత్య చేసిన విషయాన్ని వారు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. వారి సూచన మేరకు పోలీసులు ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరించారు. ప్రస్తుతం ఇద్దరినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు, కేసుపై మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన అక్రమ సంబంధాలు, కుటుంబ విభేదాలు ఎంతటి దారుణాలకు దారితీస్తాయో మరోసారి గుర్తు చేసింది. 11 నెలల పాటు పక్కా ప్రణాళికతో నేరాన్ని దాచిపెట్టినా, చివరకు సాంకేతిక ఆధారాలు, ఒక చిన్న పొరపాటు నిందితులను చట్టం ముందు నిలబెట్టాయి.











