నిజామాబాద్, 2023-07-23
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమ నాయకుడు, ప్రముఖ న్యాయవాది సుదర్శన్ రావు ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు, సుదర్శన్ రావు నివాసానికి వెళ్లి ఆయన కుమారుడిని పరామర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమ నాయకుడు, ప్రముఖ న్యాయవాది సుదర్శన్ రావు ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిజామాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు, సుదర్శన్ రావు నివాసానికి వెళ్లి ఆయన కుమారుడిని పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, సుదర్శన్ రావు చిత్రపటానికి నివాళులర్పించారు.
తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని విఠల్ రావు పేర్కొన్నారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.












