Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 23
నిర్మల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నూతన జనరేటర్‌ను జిల్లా రెవెన్యూ అధికారి రాథోడ్ రమేష్ గురువారం ప్రారంభించారు. విద్యుత్ అంతరాయాల సమయంలోనూ ప్రభుత్వ సేవలకు ఆటంకం ఉండదని ఆయన తెలిపారు.
జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నూతన జనరేటర్‌ను జిల్లా రెవెన్యూ అధికారి రాథోడ్ రమేష్ గురువారం ప్రారంభించారు. స్విచ్ ఆన్ చేసి జనరేటర్‌ను వినియోగంలోకి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా డీఆర్ఓ రాథోడ్ రమేష్ మాట్లాడుతూ, విద్యుత్ అంతరాయాల సమయంలో కూడా కలెక్టరేట్లోని వివిధ శాఖల కార్యాలయాల పనులు నిరంతరాయంగా కొనసాగేందుకు ఈ జనరేటర్ ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు అంతరాయం లేకుండా అందేలా అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పరిపాలన అధికారి ప్రవీణ్, సిబ్బంది పరమేశ్ తదితరులు పాల్గొన్నారు.












