రాజన్న సిరిసిల్ల, జులై 23
బోయిన్పల్లి మండలంలోని విలాసాగర్ గ్రామంలో శ్రీకృష్ణ కురుమ యాదవ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు గ్రామ సర్పంచ్ ఏనుగుల కనకయ్య ముఖ్య అతిథిగా హాజరై, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, గ్రామ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
బోయిన్పల్లి మండలంలోని విలాసాగర్ గ్రామంలో శ్రీకృష్ణ కురుమ యాదవ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఏనుగుల కనకయ్య ముఖ్య అతిథిగా హాజరై పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా శ్రీకృష్ణ కురుమ యాదవ సంఘం నాయకులు, సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి కటాక్షంతో గ్రామ ప్రజలకు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని భక్తులు ప్రార్థించారు.
పోచమ్మ బోనాల ఉత్సవాలు భక్తిపూర్వక వాతావరణంలో అత్యంత వైభవంగా, విజయవంతంగా నిర్వహించబడ్డాయి.












