జూబ్లీహిల్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 23
తమ చిన్న కుమారుడు ఆర్య జన్మినాన్ని పురస్కరిచుకుని తెలగాణ రక్షణ సేన ప్రధాన నాయకురాలు కల్వకుట్ల కవిత దంపతులు, ేవనపల్లి అనిల్ పతులు కుటుబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్‌లోని పె్మ్మ తల్లి ఆలయాన్ని ర్శిచుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిచి, కుమారుడికి అమ్మవారి ఆశీస్సులు అాలని ప్రార్థిచారు.
తమ చిన్న కుమారుడు ఆర్య జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రక్షణ సేన ప్రధాన నాయకురాలు కల్వకుంట్ల కవిత, దేవనపల్లి అనిల్ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. కుమారుడు ఆర్యకు అమ్మవారి ఆశీస్సులు లభించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
అనంతరం ఆలయ చైర్మన్ పి. విష్ణువర్ధన్ రెడ్డి కల్వకుంట్ల కవిత, దేవనపల్లి అనిల్ దంపతులను శాలువాతో సత్కరించి, అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
జన్మదిన వేడుకల సందర్భంగా కుటుంబ సభ్యులు ఆర్యకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.












