బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 04
మండల కేంద్రంలోని వాసవి ప్రైమరీ స్కూల్లో ఆషాఢ మాసం బోనాల పండుగను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శివసత్తులు, పోతరాజుల వేషధారణలో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు.
మండల కేంద్రంలోని వాసవి ప్రైమరీ స్కూల్లో ఆషాఢ మాసం బోనాల పండుగను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శివసత్తులు, పోతరాజుల వేషధారణలో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దాసరి గంగయ్య మాట్లాడుతూ ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాల పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. ప్రతి సంవత్సరం అమ్మవారి ఆశీర్వాదం కోసం భక్తిశ్రద్ధలతో కొత్త కుండలో బోనం తయారు చేసి నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ అని తెలిపారు.
గ్రామ ప్రజలు, పిల్లలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ పండుగను నిర్వహిస్తారని ఆయన చెప్పారు. ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొని పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.