ఖమ్మం, 2026-08-04
తెలంగాణ సాహిత్య రంగంలో రెండు దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ప్రముఖ కవయిత్రి, రచయిత్రి బత్తిన గీతాకుమారికి తెలంగాణ తెలుగు భాష సంరక్షణ సంఘం నూతన రాష్ట్ర కార్యవర్గంలో స్థానం లభించింది. ఈ విషయాన్ని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాస్యం సేనాధిపతి, ప్రధాన కార్యదర్శి బుర్ర మధుసూదన్ రెడ్డి సంయుక్తంగా ప్రకటించారు.
తెలంగాణ సాహిత్య రంగంలో రెండు దశాబ్దాలుగా విశేష సేవలందిస్తున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ప్రముఖ కవయిత్రి, రచయిత్రి, విశ్రాంత ఉపాధ్యాయిని బత్తిన గీతాకుమారికి తెలంగాణ తెలుగు భాష సంరక్షణ సంఘం నూతన రాష్ట్ర కార్యవర్గంలో స్థానం లభించింది. ఈ విషయాన్ని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాస్యం సేనాధిపతి, ప్రధాన కార్యదర్శి బుర్ర మధుసూదన్ రెడ్డి సంయుక్త ప్రకటనలో వెల్లడించారు.
విశేష సేవలందించిన గీతాకుమారి
బత్తిన గీతాకుమారి 34 సంవత్సరాల పాటు ఉపాధ్యాయినిగా సేవలందించి, ఖమ్మం జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయిని పురస్కారాన్ని అందుకున్నారు. అనంతరం కవయిత్రిగా, రచయిత్రిగా, సమీక్షకురాలిగా, సాహిత్య సమూహ నిర్వాహకురాలిగా విశేష సేవలు అందిస్తున్నారు. వచన కవిత్వం, ఇష్టపదులు, బాలసాహిత్యం, గేయరచన, వ్యాసాలు, కథలు, గజల్లు తదితర సాహిత్య ప్రక్రియల్లో ఆమె చేసిన రచనలు పాఠకుల ప్రశంసలు పొందాయి.
పురస్కారాలు, బిరుదులు
సాహిత్య రంగంలో చేసిన సేవలకు గాను పలు జాతీయ, రాష్ట్ర స్థాయి పురస్కారాలు, బిరుదులు అందుకున్న గీతాకుమారి సత్తుపల్లి ప్రాంతానికి గుర్తింపు తీసుకువచ్చారు.
గీతాకుమారి స్పందన
ఈ సందర్భంగా గీతాకుమారి మాట్లాడుతూ, తెలంగాణ తెలుగు భాష అభివృద్ధి, సాహిత్య వికాసానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా తన వంతు బాధ్యతాయుతంగా సేవలు అందిస్తానని తెలిపారు. తనపై విశ్వాసం ఉంచి రాష్ట్ర కార్యవర్గంలో అవకాశం కల్పించిన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాస్యం సేనాధిపతి, ప్రధాన కార్యదర్శి బుర్ర మధుసూదన్ రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.











