కామారెడ్డి, 2026-06-05
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామానికి చెందిన ఈదులయ్య నాని రాజు, 7319 నంబర్ గల ప్రైవేట్ ఆర్టీసీ బస్సును గత పది సంవత్సరాలుగా నడుపుతూ, నేడు వెలువడిన ప్రభుత్వ ఆర్టీసీ డ్రైవర్ పోస్టుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా భూంపల్లి గ్రామస్తులు ఆయనను అభినందించారు.

కుటుంబ నేపథ్యం
నాని రాజు నిరుపేద కుటుంబంలో జన్మించారు. వారి తల్లిదండ్రులు ఈదులయ్య, పద్మ నారాయణ దంపతులకు ఒక కూతురు, ఒక కొడుకు. అతి చిన్న వయస్సులోనే తండ్రి చనిపోవడంతో, వారి ఆలనా పాలనా తల్లి ఈదులయ్య పద్మ చూసుకుంటూ జీవనం సాగించేది. కూలి పని చేస్తూ వచ్చిన డబ్బులతో కూతురు, కొడుకులను చదివించేది.
చదువును ఆపి, కుటుంబాన్ని ఆదుకున్నారు
తల్లి కూలి పని చేసి తనను, అక్కను చదివించడం కష్టమని భావించిన నాని, తన చదువును మధ్యలోనే ఆపి, అమ్మతో కలిసి రోజు కూలి పనికి వెళ్లేవాడు. అక్క చదువు కొనసాగేలా తోడ్పడ్డాడు.
ప్రైవేట్ డ్రైవర్గా ప్రస్థానం
అతి చిన్న వయస్సులోనే ప్రైవేట్ స్కూల్ బస్సు నడపడం ప్రారంభించిన నాని, 7319 నంబర్ గల ప్రైవేట్ ఆర్టీసీ బస్సును, ఆర్టీసీ బస్సును 13 సంవత్సరాలుగా నడిపారు. తన కఠోర శ్రమ, అంకితభావంతో నేడు ప్రభుత్వ ఆర్టీసీ డ్రైవర్ పోస్టుకు ఎంపికయ్యారు.
గ్రామస్తుల అభినందన
భూంపల్లి గ్రామానికి చెందిన ఈదులయ్య నాని రాజు ప్రభుత్వ ఆర్టీసీ డ్రైవర్గా ఎంపిక కావడం అభినందనీయమని గ్రామస్తులు పేర్కొన్నారు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చని నాని రాజు నిరూపించారని వారు అన్నారు.