సదాశివనగర్, ఆదివారం
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోందని, నియోజకవర్గంలో పార్టీ బలోపేతం అవుతోందని ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ అన్నారు. సదాశివనగర్ మండలంలోని మూడు గ్రామాలకు చెందిన సుమారు 50 మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం టీఆర్ఎస్ లో చేరారు.
తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుందని నియోజకవర్గ ఇన్చార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ అన్నారు. ఆదివారం సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి, అమర్ల బండ, తుక్కోజి వాడి గ్రామాలకు చెందిన సుమారు 50 మంది కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు రాజీనామా చేసి, ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, పేదల సంక్షేమమే టీఆర్ఎస్ పార్టీ లక్ష్యాలని తెలిపారు. ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం, ఉచిత విద్య అందించాలనే లక్ష్యంతో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కంకణం కట్టుకున్నారని పేర్కొన్నారు.
యువతకు ఉపాధి కల్పించేందుకు ఉపాధి పథకం, రైతుల అభివృద్ధికి వ్యవసాయ పథకం, సమాజంలోని సబ్బండ వర్గాలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో కవిత పనిచేస్తున్నారని తెలిపారు. పాంచజన్య పథకాలతో టీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తోందని చెప్పారు. సదాశివ నగర్ మండల కేంద్రంలో పార్టీని ముందుకు తీసుకెళ్తున్న మండల అధ్యక్షుడు సాయ గౌడ్‌ను ఈ సందర్భంగా అభినందించారు.
సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన ఉప్పల్ వాయి సంధ్య, తండా స్వామి, చాకలి స్వామి, చాకలి సౌందర్య, చాకలి రాజవ్వ, డంగు వెంకటి, అస లింగం, మధు, రమేష్, రాజు, అమర్ల బండకు చెందిన వార్డు మెంబర్ గుండెల్లి జీవిత, పరిధిపేట గోదావరి, పరిధిపేట రావణ్, గుండెల్లి సాయి కుమార్, తుక్కోజి వాడి గ్రామానికి చెందిన జెర్రి పోతుల రాజవ్వ, రజిత, లత, మ్యాదరి భాస్కర్, జర్రి పోతుల లింగం, రాజయ్య, జెర్రి పోతుల గంగా సాయిలు, కడ్తాల నవీన్, గైని చింటూలు పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సాయ గౌడ్, సోషల్ మీడియా ఇంచార్జి మోసర్ల శ్రీకాంత్ రెడ్డి, చాకలి లింగం, సాయిలు, రాజయ్య, కడ్తాలా నవీన్, గ్రామ అధ్యక్షుడు కడ్తాలా రాజు, అరగొండ రవి పాల్గొన్నారు.












