నిర్మల్, 2026-08-29
వెయ్యి రోజుల పాలనపై మాట్లాడే నైతికత బీఆర్ఎస్ కు లేదని ఆదివాసి కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ అన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన వారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం అన్యాయమని విమర్శించారు.
వెయ్యి రోజుల పాలనపై మాట్లాడే నైతికత బీఆర్ఎస్ కు లేదని ఆదివాసి కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ అన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన వారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం అన్యాయమని ఒక ప్రకటనలో విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సంక్షేమం, మహిళల సాధికారత, యువత ఉపాధి, పేదల సంక్షేమం, విద్య, వైద్యం, సాగునీరు, మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని చెప్పారు. రైతుల గురించి మాట్లాడే ముందు గత పాలనను గుర్తు చేసుకోవాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు.
రైతు రుణమాఫీ వంటి కీలక నిర్ణయాలను అమలు చేసి రైతులకు అండగా నిలిచామని తెలిపారు. ఎరువులు, విద్యుత్, సాగునీటి విషయంలో ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటుందన్నారు. యువత పేరుతో రాజకీయాలు చేసే హక్కు బీఆర్ఎస్ కు లేదని పేర్కొన్నారు.











