హైదరాబాద్, జులై 09
తెలంగాణలో ఎరువులను రైతులకు సులభంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మహిళా స్వయం సహాయక సంఘాలకు ఫెర్టిలైజర్ లైసెన్సులు ఇచ్చి, ఎరువుల పంపిణీ బాధ్యతలను అప్పగించాలని యోచిస్తోంది. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో ఎరువులను ఊరూరా సులభంగా రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ మేరకు మహిళా స్వయం సహాయక సంఘాలకు పంపిణీ బాధ్యతలను అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మహిళా సంఘాలకు త్వరలో ఫెర్టిలైజర్ లైసెన్సులు అందించనుంది. ఈ కార్యక్రమం అమలు కోసం ప్రణాళికలు రచిస్తోంది.
గ్రామీణ ప్రాంతాల్లో చురుగ్గా పనిచేసే మహిళా సంఘాలను గుర్తించి, వీరికి ఫెర్టిలైజర్ లైసెన్సులు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో దాదాపు 4.67 లక్షల మహిళా సంఘాలు ఉన్నాయి. వీరిలో కొంతమందిని ఎంపిక చేసి లైసెన్స్ అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
అలాగే, వీరికి యూరియా యాప్ వినియోగంపై శిక్షణ కూడా ఇవ్వనున్నారు. మహిళా సంఘాల కోసం 8,126 సొంత భవనాలను నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ కేంద్రాల్లోనే ఎరువులు నిల్వ చేసుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు. దీనివల్ల రైతులు తమ గ్రామంలోనే ఎరువులు కొనుగోలు చేయవచ్చు. ఇందుకోసం పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.












