నిర్మల్, 3 September
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించేందుకు తెలంగాణ సచివాలయానికి వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రామచందర్ రావు, బీజేవైఎం నాయకులు, బీజేపీ శాసనసభాపక్ష నేత శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డిలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు.
తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ.... మనోరంజని న్యూస్ టుడే ఈరోజు విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించేందుకు వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రామచందర్ రావు , బీజేవైఎం నాయకులతో పాటు బీజేపీ శాసనసభాపక్ష నేత శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ని తెలంగాణ సచివాలయం వద్ద అక్రమంగా అరెస్ట్ చేశారు. మూడు రోజుల్లో రెండోసారి మహేశ్వర్ రెడ్డి ని అరెస్ట్ చేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం. తెలంగాణ పోలీసులు కాంగ్రెస్ పోలీసులుగా మారారు అరెస్టులతో బీజేపీ గొంతును అణచలేరు. ప్రజల పక్షాన మా పోరాటం మరింత ఉద్ధృతంగా కొనసాగుతుంది












