హైదరాబాద్, 3 September
తెలంగాణ మంత్రి కొండా సురేఖను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసినట్లు పేర్కొంటూ సోషల్ మీడియాలో ఓ వార్తా కార్డు వైరల్‌గా మారింది. ఈ వార్తా కార్డులో సురేఖను తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించినట్లు, ఇందుకు సంబంధించిన సిఫార్సును గవర్నర్‌కు పంపినట్లు పేర్కొన్నారు.
కొండా సురేఖ బర్తరఫ్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం అధికారిక ప్రకటన వెలువడే వరకు నమ్మొద్దని సూచనలు హైదరాబాద్, సెప్టెంబరు 3 ( తెలంగాణ మంత్రి కొండా సురేఖను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసినట్లు పేర్కొంటూ సోషల్ మీడియాలో ఓ వార్తా కార్డు వైరల్‌గా మారింది. ‘మెరుపు షార్ట్ న్యూస్’ పేరుతో రూపొందించిన ఈ పోస్టులో సురేఖను తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించినట్లు, ఇందుకు సంబంధించిన సిఫార్సును గవర్నర్‌కు పంపినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవి నుంచి డాక్టర్ జి. చిన్నారెడ్డిని తొలగించి, ఆ స్థానంలో గద్వాల విజయలక్ష్మిని నియమించినట్లు, మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద, కుడా చైర్‌పర్సన్‌గా మాజీ ఎంపీ సుధారాణిని నియమించినట్లు ఆ పోస్టులో పేర్కొన్నారు. అయితే ఈ విషయాలకు సంబంధించి అధికారిక ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో) లేదా ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడినట్లు నిర్ధారణ కాలేదు. దీంతో వైరల్ అవుతున్న ఈ వార్తా కార్డు నిజమైనదా? కాదా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వం లేదా రాజ్‌భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే ఈ అంశంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటివరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇలాంటి పోస్టులను ధృవీకరించకుండా షేర్ చేయవద్దని పలువురు సూచిస్తున్నారు. గమనిక: ఈ కథనం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ఆధారంగా రూపొందించబడింది. సంబంధిత అధికారుల నుంచి అధికారిక ధ్రువీకరణ లభించిన తర్వాతే దీనిని నిర్ధారిత వార్తగా పరిగణించాలి.

