మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 21
వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళిత, గిరిజనులపై దాడులు, హత్యలు, హత్య రాజకీయాలకు శ్రీకారం చుట్టిందని కావలి నియోజకవర్గం ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఆరోపించారు. కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హత్య రాజకీయాలు చేయిస్తున్నారని విమర్శలు గుప్పించారు. టిడిపి కార్యకర్త చాట్ల వాసు హత్యకు ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరుడే కారణమని ఆరోపించారు.
దళితులపై దాడులు, హత్యలు వైసిపి పాలనలోనే జరుగుతున్నాయని, దీనికి చెట్టుకు చెట్టు చావుకు చావు కై వైసిపి సిద్ధంగా ఉండాలని కావలి నియోజకవర్గం ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఘాటుగా స్పందించారు. సోమవారం కావలి టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
మునుపెన్నడు లేని విధంగా వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యంగా దళిత, గిరిజనులపై దాడులు, హత్యలు, హత్య రాజకీయాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని టీడీపీ నాయకులు ఆరోపించారు. రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళిత, గిరిజన నేతలు, కార్యకర్తలపై హత్య రాజకీయాలు జరుగుతున్నాయన్నారు. అదే క్రమంలో గొడ్డలి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి క్రమంలో కొనసాగుతున్న కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో జరిగే హత్య రాజకీయాల్లో కావలి మాజీ పోటీపడి మరీ చేయిస్తున్నారని విమర్శించారు.
గత రాజకీయాలు వేరు, ప్రస్తుత రాజకీయాలు వేరుగా ఉన్నాయని తెలిపారు. వైసిపి పార్టీకి అధికారం ఉన్నా, లేకపోయినా జగన్ తో పోటీపడి కావలి మాజీ ఎమ్మెల్యే హత్య రాజకీయాలు చేయిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. కావలి రూరల్ మండలం సర్వాయపాలెం పంచాయతీ, తాగేటిపాలెంకు చెందిన చాట్ల వాసు అనే వ్యక్తి పార్టీలో బలంగా ఉన్నారన్న కారణంగా, టిడిపి కార్యకర్తలను వైసిపి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరుడు, మాజీ సర్పంచ్ ముండ మధు ఆధ్వర్యంలో ప్రధాన నిందితుడిగా ఉండి హత్యకు పాల్పడటం, ఆ గ్రామంలో భయాందోళనలు చేయించి, పార్టీ కేడర్ ను బలహీన పరిచే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
గతంలో వైసిపి అధికారంలో ఉన్నపుడు దుగ్గిరాల కరుణాకర్, తేజ, పైడి హర్ష అనే టిడిపి ఎస్బీ నేతలపై గొడ్డలి పార్టీ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి హత్య రాజకీయాలు చేశారని, ప్రస్తుతం అధికారం కోల్పోయినప్పటికీ తట్టుకోలేక తిరిగి అదే వంచనతో నేడు హత్య రాజకీయాలు చేయిస్తున్నారని ఆరోపించారు. టిడిపి కార్యకర్త చాట్ల వాసు మర్డర్, టిడిపి మాజీ ఎంపీటీసీ అరగల కిష్టయ్యపై వైసిపి నేతలు దాడులకు పాల్పడటం చూస్తుంటే ఈ వైసీపీ గొడ్డలి పార్టీ ఆధ్వర్యంలోనే ఎస్సీ, ఎస్టీలపై దాడులు చేస్తున్నారని, ఎస్సీలపై ఎస్పీలను, ఎస్టీలపై ఎస్టీలను పురుగోలిపి వీరిని హత్యలకు గురిచేయడం, జైళ్లకు పంపడం వెనుక పథకా ప్రణాళికలు నేపడుతున్నారని విమర్శలు చేశారు.
కావలిని ప్రశాంతంగా ఉంచాలని చూస్తున్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఓపికను పరీక్షిస్తున్నారా అని ప్రశ్నించారు. మా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అడ్డుకుంటే కావలిలో వైసిపి కనుమరుగు కావడం ఖాయం అన్నారు. అలాంటి దుర్వార్దపు చర్యలకు మా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి దూరంగా ఉంటూ, కావలిని అభివృద్ధి చేసి అనేక కంపెనీలు కావలికి తీసుకురావాలి అన్నదే కావ్య కృష్ణారెడ్డి ప్రణాళిక అన్నారు. అంతేగానీ హత్య రాజకీయాలు ఆయనకు తెలియవన్నారు.












