July 24 (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 24
తొందరపాటులో తప్పు నంబర్‌కు మొబైల్ రీఛార్జ్ చేశారా? కంగారు పడకండి. మీ డబ్బులను తిరిగి పొందేందుకు కొన్ని సులభమైన మార్గాలున్నాయి. వివిధ టెలికాం ఆపరేటర్లు దీనికి సంబంధించిన పరిష్కారాలను అందిస్తున్నాయి.
నేటి కాలంలో మొబైల్ రీఛార్జ్ చేయడం చాలా సులభమైంది. అయితే, తొందరపాటులో వేరే నంబర్‌కు రీఛార్జ్ చేస్తే కంగారు పడాల్సిన అవసరం లేదు. డబ్బులు తిరిగి పొందేందుకు కొన్ని మార్గాలున్నాయి.
Jio వినియోగదారులు తాము రీఛార్జ్ చేసిన 3 గంటల్లోపు MyJio యాప్‌లోని 'Recharge History' కి వెళ్లి 'Plan Cancel' ఆప్షన్‌ను క్లిక్ చేయడం ద్వారా రీఛార్జ్‌ను రద్దు చేసుకోవచ్చు. Airtel వినియోగదారులు Airtel Thanks యాప్‌లోని Help సెక్షన్‌కు వెళ్లి 'Wrong Recharge Reversal' ద్వారా ఫిర్యాదు చేయాలి. Vi వినియోగదారులు అయితే 51619 నంబర్‌కు కాల్ చేసి తమ సమస్యను వివరించాలి.
ఈ ప్రక్రియలను వెంటనే ప్రారంభిస్తే, తప్పు నంబర్‌కు రీఛార్జ్ అయిన సొమ్మును తిరిగి పొందే అవకాశం ఉంది.










