సారంగాపూర్ మండల సర్పంచ్ల సంఘం నూతన కార్యవర్గం శనివారం ఏకగ్రీవంగా ఎన్నికైంది. మండలంలోని సర్పంచ్ల సమక్షంలో జరిగిన సమావేశంలో నూతన కమిటీ సభ్యులను ఎంపిక చేశారు.
నూతన కార్యవర్గ అధ్యక్షులుగా మంతెన గంగారెడ్డి, గౌరవ అధ్యక్షులుగా కునేరు భూమన్న, ప్రధాన కార్యదర్శిగా కరిపే రావాలి–విలాస్, ఉపాధ్యక్షులుగా జాదవ్ దిలీప్, మాధ్యమాల బాధ్యులుగా ఆడే పంచిబాయి దిలీప్, కోశాధికారిగా రాథోడ్ గవస్కర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతన అధ్యక్షుడు మంతెన గంగారెడ్డి మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి, సర్పంచ్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి గ్రామాల సమగ్రాభివృద్ధికి పాటుపడతామని చెప్పారు.
గౌరవ అధ్యక్షుడు కునేరు భూమన్న సర్పంచ్‌లందరూ ఐక్యంగా పనిచేసి మండల అభివృద్ధికి సహకరించాలని కోరారు.
ఈ ఎన్నిక ప్రక్రియలో మండలంలోని పలువురు సర్పంచ్‌లు పాల్గొన్నారు. నూతన కమిటీ సభ్యులను వారు అభినందించారు.










